పదో తరగతి హిందీ మరియు ఇంగ్లీష్ పరీక్షల్లో పొరపాటుగా వచ్చిన ప్రశ్నలకు విద్యార్థులకు వరుసగా రెండు మరియు నాలుగు చొప్పున మార్కులు కలపాలని ఎస్ఎస్‌సీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్ పేపర్‌లో నాలుగు మార్కులకు సంబంధించిన 28వ ప్రశ్న పాఠ్యపుస్తకం నుంచి కాకుండా వర్క్ బుక్ నుంచి రావడంతో బోర్డు ఈ మేరకు స్పందించింది. అలాగే హిందీలో మూడు మరియు ఆరో ప్రశ్నలకు సంబంధించి అక్షర దోషాలు దొర్లడంతో అక్కడ కూడా మార్కులు కలపాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ అదనపు మార్కులు కేవలం సదరు ప్రశ్నలను అటెమ్ట్ చేసిన విద్యార్థులకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేశారు. విద్యార్థులు ఏదో ఒక సమాధానం రాసి ఉంటేనే ఈ మార్కులు పొందడానికి అర్హులవుతారు.
news by: BSS Prasad
0 Comments