విశ్వ విజ్ఞాన ఖని పూజ్య అంబేద్కర్ జయంతి సందర్భంగా

​జయహో పూజ్య అంబేద్కరా! హక్కుల ప్రదాత జయహో

​కులం రగిల్చిన కార్చిచ్చులో తగలడ్డ భారత వనం!

మనువు సాక్షిగా మానవత్వం మంటగలిసిన రోజులవి,

​అసహాయ నిర్భాగ్యుల దైన్యంతో అంటరానితనం

పైశాచిక కరాళ నృత్యతాండవం క్రింద నలిగిన నిస్సహాయుల

ఆక్రందనాలను విని దేవుడొకడు ఈ గడ్డ పై జనియించే

నవయుగ వైతాళికుడై దీన జన బంధువై ఉదయించే

ఒక విశ్వ మేధావి అదే మన పూజ్య అంబేద్కర్!!

​దీనులు కన్నీళ్లు తుడిచి హక్కులు రాజపత్రాన్ని

భారత రాజ్యాంగ పేరిట బహుకరించి జీవించే హక్కు లిచ్చి,

సమానత్వం సౌభ్రాతృత్వం సామాజిక న్యాయం లౌకిక వాదం

పేరిట నిన్ను విశ్వజనియ మానవునిగా చెక్కిన భారత రూపశిల్పి

మన దేవుడు అంబేద్కర్ జయంతి నేడు!

​స్మరించుకుందాం సమర్పించుకుందాం ఘన నీలి నివాళులు!!!

జయహో పూజ్య అంబేద్కరా జయహో విశ్వవిజ్ఞానఖని

జయహో!!!

- రచన..నూతలపాటి భరత్ భూషణ్ రాజు

( ఉత్తరాంధ్రా దళిత కవి, రచయిత, సామాజిక ఉద్యమ నేత )

Post a Comment

0 Comments