పాలకొండ సబ్ జైలు ప్రాంగణంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

​పాలకొండ వెబ్ న్యూస్, 14 ఏప్రిల్ 2026:​పాలకొండ సబ్ జైలు ప్రాంగణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు  ఘనంగా నిర్వహించారు. సబ్ జైలు సూపరిండెంట్ జోగులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాలకొండ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎం.వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి అంబేద్కర్ చేసిన అసమాన సేవలను కొనియాడారు. రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పోషించిన పాత్ర మరియు సామాజిక సమానత్వం కోసం ఆయన పడిన కృషిని ఈ సందర్భంగా వివరించారు. దేశ గమనాన్ని మార్చిన మహనీయుని ఆశయాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరారు. ఈ వేడుకల్లో సబ్ జైలు సిబ్బంది అందరూ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు

Post a Comment

0 Comments