ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలురు ఫలితాలలో మెరుగైన ఫలితాలు సాధించడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ వేమూరు హరగోపాల్ హర్షం వ్యక్తం చేశారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలలో కళాశాల నుండి 209 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా వారిలో 179 మంది ఉత్తీర్ణత సాధించారు. దీనితో పాలకొండ పట్టణంలోనే 86 శాతం ఫలితాలు సాధించిన కళాశాలగా ప్రథమస్థానంలో నిలిచింది. అలాగే ప్రథమ సంవత్సరంలో 221 మంది విద్యార్థులకు 150 మంది పాసై 69 శాతం ఫలితాలు సాధించారు.
కళాశాల టాపర్ గా సెకండ్ ఇయర్ విద్యార్థి సవర పవిత్ర 1000 మార్కులకు గాను 956 మార్కులు సాధించి కళాశాల ప్రథమంగా నిలిచారు. అలాగే ఎంపీసీ విభాగంలో వి లోహిత్ 910 మార్కులు, కోరంగి కృష్ణవేణి 954 మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరంలో 500 మార్కులకు గాను సమర శ్రావణి 485 మార్కులు, సవర సుశాంత్ 484 మార్కులు, గేదెల అరవింద్ 462 మార్కులు సాధించారు. బైపిసి విభాగంలో 445 కి గాను 441 మార్కులతో దేవిక కళాశాల టాపర్ గా నిలవగా, పద్మశ్రీ 440 మార్కులు సాధించారు. మెరుగైన ఫలితాలు సాధించడంలో అంకితభావంతో పని చేసిన సిబ్బందిని ప్రిన్సిపాల్ వేమూరు హరగోపాల్ అభినందించారు.
news by: BSS Prasad
0 Comments