పాలకొండ వెబ్ న్యూస్, ఏప్రిల్ 15, 2026: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల్లో పాలకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 75 శాతం, వోకేషనల్ విభాగంలో 95 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రైవేట్ సంస్థలకు దీటుగా నిలిచారు. ప్రథమ సంవత్సరంలోనూ జనరల్ విభాగంలో 67 శాతం, వోకేషనల్ విభాగంలో 90 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీలో లావేటి రుషిత 981 మార్కులతో రికార్డు సృష్టించగా, నిర్మల, అనురాధ, సరాయి, రిబిక, పినీన, శ్రీజలు అత్యుత్తమ మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరంలో కృష్ణవేణి, జీవిత, రాధ, జెస్సికా, అమల, హెలీనా ప్రతిభ చాటారు. విద్యార్థినుల కఠోర శ్రమ, అధ్యాపకుల బోధన వల్లే ఈ ఘనత సాధ్యమైందని ప్రిన్సిపాల్ బొబ్బిలి రేణుక కొనియాడారు. పరీక్షల నిర్వహణలో సహకరించిన యు. సత్యప్రభ, కె. కూర్మినాయుడులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.news by: BSS Prasad
0 Comments