రైతులు వ్యాపారవేత్తలుగా ఎదగాలి: అభ్యుదయ రైతు ప్రసాదరావుకు ఘన సన్మానం

పాలకొండ వెబ్ న్యూస్..17 ఏప్రిల్, 2026..శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉత్తర కోస్తా వ్యవసాయ విస్తరణ పరిశోధనా కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంతీయ సమావేశం ఘనంగా ముగిసింది. ఖరీఫ్, రబీ సీజన్ల ప్రణాళికలపై జరిగిన ఈ సదస్సులో రెండో రోజున ఒక విశేష కార్యక్రమం నిర్వహించారు. రైతులు కేవలం సాగుకే పరిమితం కాకుండా ఆర్థికంగా నిలదొక్కుకుని వ్యాపారవేత్తలుగా ఎలా ఎదగాలనే అంశంపై అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు రూపొందించిన 16 పేజీల సమగ్ర నివేదికను అధికారులకు సమర్పించారు. రైతు సాధికారతకు దిశానిర్దేశం చేసేలా ఉన్న ఈ పత్రాన్ని పరిశీలించిన విస్తరణ సంచాలకులు పీవీ సత్యనారాయణ ప్రసాదరావు కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ అభ్యుదయ రైతును శాలువాతో ఘనంగా సన్మానించారు. రైతుల ప్రయోజనం కోసం ఆయన చేసిన ఈ డాక్యుమెంటేషన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సదస్సులో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.
news by: BSS Prasad

Post a Comment

0 Comments