పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 17 ఏప్రిల్ 2026..స్థానిక అన్నవరం గ్రామం వద్ద గల జి.ఎం.ఆర్ సీతామహాలక్ష్మి డి.ఏ.వి పబ్లిక్ పాఠశాల విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరం సిబిఎస్ఈ పదవ తరగతి ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ ఫలితాలలో తోట భాను శివ నాగ రంగ సాయి 94.4 శాతం మార్కులతో ప్రథమ స్థానం సాధించగా, గుండు మనస్విక దుర్గ 91.8 శాతం మార్కులతో ద్వితీయ స్థానం, బర్రి వేణుగోపాల్ 91.4 శాతం మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. ఈ పరీక్షల్లో పాఠశాల వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, తెలుగు సబ్జెక్టులో ఇద్దరు విద్యార్థులు వందకు వంద మార్కులు సాధించడం విశేషం. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను మరియు ప్రిన్సిపాల్ ఎం. వెంకటరామిరెడ్డిని పాఠశాల యాజమాన్యం, జిఎంఆర్ ప్రాజెక్టు ప్రతినిధులు మరియు తల్లిదండ్రులు హృదయపూర్వకంగా అభినందించారు. విద్యార్థుల కృషిని, పాఠశాల విద్యా ప్రమాణాలను పలువురు కొనియాడారు.news by: BSS Prasad
0 Comments