విక్రమపురంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 15-04-2026:
విక్రమపురం గ్రామానికి చెందిన గెంబలి అలివేలు మంగమ్మకు ఇటీవల కాలుకు గాయమవడంతో చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఆమె కుటుంబానికి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి 50,130 రూపాయల చెక్‌ను స్థానిక శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం పట్ల గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విక్రమపురం నాయుకులు, తెలుగుయువత అధ్యక్షులు మాచర్ల అనిల్ బాబు, టౌన్ నాయుకులు జామి లక్ష్మి నారాయణ, తూర్పు కాపు రాష్ట్ర డైరక్టర్ గర్భనా సత్తిబాబు, ఉమ్మడి జిల్లా సంయుక్త కార్యదర్శి జానీ, కళింగ వైశ్య డైరక్టర్ తూముల రమేష్, చుక్కా శ్రీను తదితర కూటమి నాయుకులు పాల్గొన్నారు.
news by: BSS Prasad

Post a Comment

0 Comments