అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావుకు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సన్మానం

పాలకొండ వెబ్ న్యూస్..14 ఏప్రిల్, 2026:చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో నిర్వహించిన ఉన్నత పర్వత శ్రేణి మరియు గిరిజన మండల వ్యవసాయ పరిశోధనా విస్తరణ సలహా మండలి సమావేశంలో వాటర్ రిసోర్సెస్ నిపుణులు ఖండాపు ప్రసాదరావును శాస్త్రవేత్తలు ఘనంగా సత్కరించారు. పరిశోధనా సంచాలకులు పి.వి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రసాదరావు వ్యవసాయ రంగంలో తను అందించిన 58 ఏళ్ల సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం వ్యవసాయ, జలవనరుల శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరుతూ ఒక కీలక డాక్యుమెంట్‌ను అధికారులకు అందజేశారు. ముఖ్యంగా పాలకొండ ప్రాంతంలో శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల రబీ సీజన్‌లో రైతులు ఎదుర్కొన్న నష్టాలను ఆయన ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించారు. రిటైర్ ఐఏఎస్ బాబూరావు నాయుడు, డీన్ ఏవీ రమణ, అప్పలస్వామి మరియు ఇతర శాస్త్రవేత్తలు పాల్గొన్న ఈ సభలో ప్రసాదరావు చేతుల మీదుగా మహిళా శాస్త్రవేత్తలను కూడా సన్మానించడం విశేషం.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments