అప్రమత్తతే రక్షణ కవచం: సత్యసాయి పాఠశాలలో అగ్నిమాపక మాక్ డ్రిల్

పాలకొండ వెబ్ న్యూస్, ఏప్రిల్ 17, 2026: జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా స్థానిక సత్యసాయి పాఠశాలలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో భారీ నమూనా ప్రదర్శన నిర్వహించారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ ఆస్తి నష్టాలను ఎలా నివారించాలో విద్యార్థులకు అధికారులు వివరించారు. ప్రతి విద్యాసంస్థలో రక్షణ, రవాణా, ప్రథమ చికిత్స వంటి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుని నిరంతరం శిక్షణ పొందాలని సూచించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందిస్తూ అందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చే విధానాలను ప్రయోగాత్మకంగా చూపారు. అత్యవసర సమయాల్లో 108 వాహనాలు, పాఠశాల బస్సులను సిద్ధం చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు అగ్నిమాపక సిబ్బంది పాల్గొని అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన పెంపొందించుకున్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments