పాలకొండ నగర పంచాయతీ పరిధిలో శాశ్వత త్రాగునీటి పరిష్కారానికి పునాది

పాలకొండ వెబ్ న్యూస్..తేది: 18-04-2026:​పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయక్రిష్ణ పర్యటనలో భాగంగా మంగలాపురం బ్రిడ్జి సమీపంలోని సంకిలి వద్ద 72 కోట్ల రూపాయల వ్యయంతో మంజూరైన నాన్ అమృత్ వాటర్ స్కీమ్ ఇన్ఫిల్ట్రేషన్ వెల్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జయక్రిష్ణ మాట్లాడుతూ పాలకొండ పట్టణ ప్రజల దశాబ్దాల త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నగర పంచాయతీ పరిధిలోని ప్రతి ఇంటికి శుద్ధమైన నీటిని అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యం మరియు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందని, నాణ్యతతో కూడిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కూటమి నాయకులు మరియు అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments