పుస్తకాలు ఒక సమాజానికి అద్దంలాంటివి. గత చరిత్రను, అనుభవాలను, సాంస్కృతిక వారసత్వాన్ని తరతరాలకు అందించే ముఖ్యమైన సాధనాలు. సాహిత్యాభివృద్ధికి, జ్ఞాన విస్తరణకు పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే పుస్తక పఠనం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి అని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో పుస్తక పఠనం క్రమంగా తగ్గుతున్నట్లు పరిశీలనలు చెబుతున్నాయి. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, టెలివిజన్ వంటి ఎలక్ట్రానిక్ సాధనాల వినియోగం విపరీతంగా పెరిగింది. భారతదేశంలో 100 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఉండగా, వారిలో అధిక శాతం వీడియో కంటెంట్‌పైనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. సగటున ఒక భారతీయుడు రోజుకు నాలుగు గంటలు మొబైల్ వినియోగిస్తున్నాడని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పుస్తకాల పట్ల ఆసక్తిని మళ్లీ పెంచాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిరోజూ కొంత సమయం పఠనానికి కేటాయించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
ఇక కాపీరైట్ విషయానికి వస్తే, ఒక రచయిత తన రచనలపై నిర్దిష్ట కాలం వరకు కలిగి ఉండే చట్టబద్ధమైన హక్కునే ‘కాపీరైట్’ అంటారు. ఇది రచయితల సృజనాత్మకతను రక్షించే ముఖ్యమైన విధానం.
చారిత్రకంగా కూడా ఏప్రిల్ 23కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ప్రముఖ సాహితీవేత్తలు , వంటి మహనీయుల జననం లేదా మరణం ఈ రోజునే సంభవించాయి. వారి జ్ఞాపకార్థం 1995లో UNESCO ఈ రోజును ప్రపంచ పుస్తక దినోత్సవంగా ప్రకటించింది.
ప్రస్తుత కాలంలో డిజిటల్ ప్రభావం పెరిగినప్పటికీ, పుస్తకాలు అందించే లోతైన జ్ఞానం, ఆలోచనా శక్తి మరే సాధనంతో పోల్చలేనిది. కాబట్టి ఈ ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ పఠనాన్ని అలవాటు చేసుకోవడం సమాజ అభివృద్ధికి దోహదం చేస్తుంది.
0 Comments