మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కోరితే, కేంద్రం చేయూత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితి లేదనడం విచారకరమని జల స్పందన కార్యనిర్వాహక సభ్యులు ఖండాపు ప్రసాదరావు అన్నారు. మద్దతు ధరను నమ్మి పంటలు వేస్తే, తీరా చేతికొచ్చే సరికి వ్యాపారులు తక్కువ ధరకు కొనడం వల్ల రైతులు ఎకరాకు 20 వేల వరకు నష్టపోతున్నారు. ధరల స్థిరీకరణకు కేంద్రం బడ్జెట్ కేటాయిస్తున్నా, మన రాష్ట్ర ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించడంలో విఫలమవుతున్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో కొనుగోళ్లు జరుగుతుంటే, ఇక్కడ మాత్రం రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పాలకులు ఇప్పటికైనా స్పందించి మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
news by: BSS Prasad
0 Comments