ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పాలకొండ ప్రెస్ క్లబ్ వినతి

పాలకొండ వెబ్ న్యూస్, 28 ఏప్రిల్, 2026: ​చిత్తూరు జిల్లా బి. కొత్తకోట మండలం ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను నిరసిస్తూ పాలకొండ ప్రెస్ క్లబ్ సభ్యులు స్థానిక తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి సామాజిక అక్రమాలపై ధైర్యంగా వార్తా కథనాలు రాసినందుకు జగన్మోహన్ రెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేయడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా వారు పేర్కొన్నారు. ఈ ఘటన నికార్సైన జర్నలిస్టులకు రక్షణ లేదని నిరూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితుడి కుటుంబానికి భారీ ఆర్థిక సాయం అందించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments