మేడే కర్తవ్యం ఎనిమిది గంటల పని విధానాన్ని కాపాడుకోవడమే

​పాలకొండ వెబ్ న్యూస్, 02-05-2026: ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించుకోవడమే నేడు కార్మిక వర్గం ముందున్న ప్రధాన కర్తవ్యమని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఏ లక్ష్మణరావు అన్నారు. పాలకొండ మండలం తంపటాపల్లిలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో టి శ్రీరాములు అధ్యక్షతన మేడే సభ జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తూ కార్మికులను కట్టుబానిసలుగా మారుస్తున్నాయని విమర్శించారు. 140 ఏళ్ల క్రితం పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని కాదని, 12 గంటల పని విధానాన్ని తీసుకురావడం కార్మిక సంక్షేమం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ క్లైములు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నా వేతనాలు పెరగడం లేదని, హక్కుల సాధన కోసం మేడే స్ఫూర్తితో కార్మికులు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మిక నాయకులు పాల్గొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments