డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని యాలం జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి డిఎస్పి మీ. రాంబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ ఎద్దు లిల్లీ పుష్పనాధం, అరకు పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జి బత్తిన మోహన్, లుంబూరు మాజీ సర్పంచ్ తిర్లంగి ఉపేంద్ర, బత్తిన జీవరత్నం, బబ్బురు గణేష్ బాబు, జి. రవి, కొంచాడ జాన్ మాస్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని నమ్మిన ఆయన, ప్రతి విద్యార్థి సామాజిక న్యాయం మరియు రాజకీయ హక్కుల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పోషించిన పాత్ర అద్వితీయమని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు.
news by: BSS Prasad
0 Comments