అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం: ఘనంగా జయంతి వేడుకలు

పాలకొండ వెబ్ న్యూస్..తేది: 14-04-2026​..భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు మన్యం జిల్లా పార్వతీపురంలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ మరియు పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయక్రిష్ణ పాల్గొన్నారు. వీరు స్థానిక నేతలు తోయిక జగదీశ్వరి, బోనెల విజయచంద్రతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిమ్మక జయక్రిష్ణ మాట్లాడుతూ సామాజిక సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments