వెలగవాడలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

పాలకొండ వెబ్ న్యూస్..14 ఏప్రిల్, 2026:​ పాలకొండ మండలం వెలగవాడ గ్రామంలో అంబేద్కర్ 135వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అంబేద్కర్ యూత్ ఐకాన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సంఘం అధ్యక్షులు టి.శంకర రావు, కార్యదర్శి ఎం.లక్ష్మణరావు, జనసేన అధ్యక్షులు గర్భాన సత్తిబాబు, డాక్టర్ రవీంద్ర కుమార్ మరియు ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ చిరంజీవి కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ చిరంజీవి మాట్లాడుతూ సమాజ సేవలో అంబేద్కర్ సంఘం పాత్ర మరువలేనిదని కొనియాడారు. గర్భాన సత్తిబాబు అంబేద్కర్ ఆశయాల గురించి ప్రసంగించగా, డాక్టర్ రవీంద్ర కుమార్ రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన యువతను అభినందించారు. గ్రామానికి చెందిన అనేకమంది యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేయగా, వారికి నిర్వాహకులు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో యువత నవీన్, అసిరి నాయుడు, చిరంజీవి ఆసుపత్రి కౌన్సిలర్ కె కృష్ణరావు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments