పరిశుభ్రత పాటించని పక్షంలో చర్యలు తప్పవు: సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్

పాలకొండ వెబ్ న్యూస్ :తేదీ: 14 ఏప్రిల్, 2026:​పాలకొండ మున్సిపాలిటీ పరిధిలోని కూరగాయల మార్కెట్ మరియు కిరాణా దుకాణాలను సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ ఈ రోజు ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ సందర్భంగా దుకాణాల పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటం గమనించిన ఆయన షాపు యజమానులపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి దుకాణం యజమాని తమ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. తప్పనిసరిగా ప్రతి షాపులో చెత్త బుట్టను ఏర్పాటు చేసి, దానిని వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరి దుకాణం ముందు చెత్తాచెదారం ఉండకూడదని ఆయన స్పష్టంగా హెచ్చరించారు. వారం రోజుల్లోపు మార్కెట్ ప్రాంతమంతా పూర్తిగా శుభ్రం కావాలని, ఆ తర్వాత మళ్లీ తనిఖీ నిర్వహిస్తానని స్వప్నిల్ పవార్ స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని యజమానులకు తెలిపారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments