పాలకొండలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక నిధుల విజ్ఞప్తి

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 05-04-2026:
పాలకొండ నగర పంచాయతీ పరిధిలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు మరియు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు) పాలకొండ కమిటీ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కమిటీ గౌరవ అధ్యక్షులు దావాలా రమణారావు, కార్యదర్శి సిహెచ్ సంజీవి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి ప్రాథమిక సదుపాయాలు మెరుగుపరచాలని, కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
news by: BSS Prasad

Post a Comment

0 Comments