పాలకొండ వెబ్ న్యూస్, మే 27, 2026:భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ విజయవంతంగా 12 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్నారు. సరిగ్గా 12 సంవత్సరాల క్రితం 2014 మే 26వ తేదీన తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ మంగళవారంతో ఈ మైలురాయిని అధిగమించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు నరేంద్ర మోదీకి పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేశారు. ఆయన నాయకత్వంలో భారతదేశం తిరిగి ఆత్మవిశ్వాసం వైపు పయనించిందని, దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం సాధ్యమైందని కొనియాడారు. 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు బీజేపీ విజయం సాధించడంతో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత 12 ఏళ్లుగా 140 కోట్ల మంది తోటి పౌరులకు సేవ చేయడానికే ప్రధాని ప్రతి క్షణాన్ని అంకితం చేశారని బీజేపీ పేర్కొంది. నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేసిన వారిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు తదితరులు ఉన్నారు.
news by: BSS Prasad
0 Comments