మండల స్థాయిలో ముగిసిన ఎన్‌జేకopen క్రికెట్ ప్రీమియం లీగ్ పోటీలలో భాగంగా నియోజకవర్గ స్థాయి ఆటలకు శ్రీకృష్ణ టీం పాలకొండ, తంపటాపల్లి జట్లు అర్హత సాధించాయి. స్వర్గీయ నిమ్మక గోపాలరావు జ్ఞాపకార్థం నిర్వహించిన ఈ లీగ్ లో భాగంగా తంపటాపల్లి, గారమ్మ కాలనీ మధ్య, అలాగే బెజ్జి, శ్రీకృష్ణ యూత్ మధ్య హోరాహోరీ పోరాటాలు జరిగాయి. ఈ పోటీలలో గారమ్మ కాలనీ, శ్రీకృష్ణ యూత్ జట్లు నియోజకవర్గ స్థాయిలో జరగబోయే తదుపరి పోటీలకు ఎంపికయ్యాయని నిర్వాహకులు నెల్లి వెంకటరమణ, కొండ దాడి రాజేష్, మజ్జి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మ్యాచ్ లకు అంపైర్లుగా ఎల్ వెంకటరమణ, రాజేష్, తిరుమల, ప్రశాంత్ పోరెడ్డి వ్యవహరించారు. క్రీడాకారులకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణకు నిర్వాహకులు, ఆటగాళ్లు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ క్రీడా సంబరం పదకొండు రోజులపాటు అత్యంత సజావుగా సాగడానికి అన్ని విధాలా సహకరించిన మండల మున్సిపల్ నాయకులకు, పోలీస్ సిబ్బందికి, పత్రికా సోదరులకు నిర్వాహక కమిటీ కృతజ్ఞతలు ప్రకటించింది.
news by: BSS Prasad
0 Comments