మన్యం జిల్లాలో నిప్పులు చెరుగుతున్న ఎండలు: 15 మండలాలకు డేంజర్ అలర్ట్

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 11 మే, 2026:​పార్వతీపురం మన్యం జిల్లాలో రాబోయే ఐదు రోజుల పాటు ఎండల తీవ్రత విపరీతంగా ఉండనుందని జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్డి ప్రజలను హెచ్చరించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ నివేదిక ప్రకారం జిల్లాలో వర్ష సూచన లేదని, అయితే హీట్ ఇండెక్స్ ప్రమాదకరంగా 41 డిగ్రీల నుండి 54 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దీనిని వాతావరణ శాఖ డేంజర్ కేటగిరీగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా పాలకొండ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతానగరం, సాలూరు, పాచిపెంట, మక్కువ, సీతంపేట, భామిని, కొమరాడ, వీరఘట్టం, బలిజిపేట, జియ్యమ్మవలస, పార్వతీపురం, గరుగుబిల్లి మండలాల్లో ప్రభావం అధికంగా ఉంటుందని వివరించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం వేళల్లో బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్డి సూచించారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments