నరసింహ చెరువును అభివృద్ధి చేసి రైతులకు సాగునీరు అందించాలి

పాలకొండ వెబ్ న్యూస్, మే 11, 2026: పాలకొండ మండలంలోని పి.ఆర్.రాజుపేట గ్రామంలో ఉన్న నరసింహ చెరువును లోతు చేసి రైతులకు సాగునీరు అందించాలని అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు మరియు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బంటు దాసు కోరారు. ఈ మేరకు పార్వతీపురంలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. జలధార పథకం ద్వారా ఈ చెరువును సమగ్రంగా అభివృద్ధి చేయాలని వారు ఈ సందర్భంగా విన్నవించారు. చెరువుకు సంబంధించిన నాలుగు మదుములు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయని, వీటిని తక్షణమే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ పనులు పూర్తి చేస్తే మండలంలోని వెలగవాడ, రుద్రిపేట, ఓని, లుంబూరు మరియు గరుగుబిల్లి గ్రామాలకు చెందిన రైతులకు సాగునీరు అందుతుందని వివరించారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments