నిమ్మక గోపాలరావు మెమోరియల్ టోర్నమెంట్ బ్రోచర్ విడుదల: క్రీడల్లో యువత రాణించాలని నిమ్మక జయకృష్ణ పిలుపు

​పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 12 మే, 2026: ​మాజీ శాసనసభ్యులు స్వర్గీయ నిమ్మక గోపాలరావు జ్ఞాపకార్థం ఎన్‌జిఆర్ మెమోరియల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ప్రకటించారు. ఈ క్రీడల పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను ఆయన ఈరోజు అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ యువతను క్రీడల వైపు ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్‌ను చేపడుతున్నామని వివరించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుండి ఒక్కో మండలానికి 20 టీముల చొప్పున ఎంపిక చేస్తామని, అందులో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన మొత్తం ఎనిమిది టీములను నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పారు.

​నియోజకవర్గ స్థాయి టోర్నమెంట్ నిర్వహించే సమయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ క్రీడా సంబరం మొత్తం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు. విజేతలకు అందించే బహుమతుల వివరాలను వెల్లడిస్తూ ప్రథమ బహుమతిగా 50,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 30,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 15,000 రూపాయలు మరియు నాల్గవ బహుమతిగా 10,000 రూపాయలు అందజేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతో పాటు వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఎం రామకృష్ణ, పాలకొండ డివిజన్ స్పోర్ట్స్ ఆర్గనైజర్ నెల్లి వెంకటరమణ, వండాన రాజేంద్ర, ఎన్ని సురేష్ మరియు పలువురు పీడీలు, కోచ్‌లు పాల్గొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments