ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం ఏటి ఒడ్డు పర్త గ్రామం ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన మజ్జిగ, మంచినీరు చలివేంద్రం విజయవంతంగా 72 రోజులు పూర్తి చేసుకుంది. గ్రామానికి చెందిన యందవ అప్పలనాయుడు సహకారంతో ఉగాది రోజున ప్రారంభమైన ఈ చలివేంద్రం వేసవి కాలము పూర్తయ్యే వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. మండుటెండల్లో ప్రయాణించే బాటసారుల దాహాన్ని తీర్చడమే తమ ముఖ్య ఉద్దేశమని యందవ అప్పలనాయుడు పేర్కొన్నారు. నిత్యం వందలాది మందికి దాహార్తిని తీరుస్తూ, సమాజ హితం కోరి ఆయన చేస్తున్న ఈ మంచి కార్యక్రమాన్ని చుట్టుపక్కల ప్రజలు మరియు బాటసారులు ఎంతగానో అభినందిస్తున్నారు.
0 Comments