పాలకొండ సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బంటు దాసు, అభ్యుదయ రైతు సంఘం సీనియర్ నాయకులు ఖండాపు ప్రసాదరావు మాట్లాడారు. 2026-27 బడ్జెట్లో పార్వతీపురం మన్యం జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా కేటాయించకుండా అన్యాయం చేసిందని వారు ఆరోపించారు. వంద రోజుల్లో భూ సర్వే లోపాలు సరిచేస్తామని ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, తోటపల్లి, పెద్దగడ్డ నిర్వాసితుల పునరావాసానికి నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. తోటపల్లి ఎడమ కాలువ మరమ్మత్తులు, లస్కర్ల నియమించడం వంటి హామీలు నేటికీ పరిష్కారం కాలేదన్నారు. పంటలకు మద్దతు ధరలు పెంచాలని, జిల్లా ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేయాలని కోరుతూ జూన్ 8వ తేదీన జిల్లా కలెక్టరేట్ ఆఫీసు వద్ద జరిగే ధర్నాకు రైతులంతా కదిలి రావాలని పిలుపునిచ్చారు.
0 Comments