పాలకొండలో ఘనంగా సిఐటియు ఆవిర్భావ దినోత్సవం

పాలకొండ వెబ్ న్యూస్, మే 30:

​పాలకొండ మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయం వద్ద సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సిఐటియు జెండాను మండల అధ్యక్షులు బి అమరవేణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దావాలా రమణారావు మాట్లాడుతూ ఐక్యపోరాటాల ద్వారా కార్మిక హక్కులను, అనేక విజయాలను సాధించిన విశేషమైన చరిత్ర సిఐటియుకి ఉందన్నారు. శ్రమజీవుల హక్కుల కోసం, సమానత్వం కోసం, సామ్యవాద సమాజం కోసం సిఐటియు పనిచేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్మిక హక్కుల కోసం మరిన్ని సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కాద రాము, రైస్ మిల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జి సత్యం, కార్యదర్శి వై శ్రీనివాసరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సిహెచ్ సంజీవి, సిహెచ్ స్వామి నాయుడు పాల్గొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments