శాఖా గ్రంథాలయంలో ఉత్సాహంగా వేసవి విజ్ఞాన శిబిరం

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 03-05-2026:​పాలకొండ స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరం ఆరవ రోజు అత్యంత ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ తరగతుల్లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు కె.జనార్ధన రావు పాల్గొని పిల్లలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు అభినయ గేయాలు నేర్పించడంతో పాటు, శారీరక ధారుడ్యం కోసం చిన్న చిన్న ఆటలు మరియు యోగాసనాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం డ్రాయింగ్ మాస్టారు జి.మురళి పిల్లలకు కలర్ పెయింటింగ్‌లో మెళకువలు నేర్పిస్తూ చిత్రలేఖనంపై ఆసక్తిని పెంపొందించారు. ఈ శిబిరానికి చిన్నారుల నుండి విశేష స్పందన లభించగా, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని తమ నైపుణ్యాలను చాటుకున్నారు. కార్యక్రమంలో స్థానిక గ్రంథాలయ అధికారి బబ్బురు గణేష్ బాబు మరియు సహాయకుడు ఈశ్వర్ పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments