నెల్లి సూర్యనారాయణకు ఘన నివాళి

పాలకొండ వెబ్ న్యూస్.తేదీ: 03.05.2026:​పాలకొండ: ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన కామ్రేడ్ నెల్లి సూర్యనారాయణ చిత్రపటానికి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భవిరి కృష్ణమూర్తి మరియు అడ్వకేట్ లత పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ సూర్యనారాయణ ప్రజా ఉద్యమాల్లో ముందుండి పేదల పక్షాన పోరాడేవారని కొనియాడారు. అనంతరం సూర్యనారాయణ కుమార్తె బుడితి భారతి, అల్లుడు అప్పలనాయుడులను నాయకులు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ వావిలపల్లి లక్ష్మీనాయుడు, అధ్యాపకులు జడ్డు బాలరాజు, బెజ్జపురం చిన్ననాయుడు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకుడు కాదు రాము తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments