దశుమంతపురంలో వైభవంగా రామమందిర ప్రతిష్ట: ఎన్వీ రమణ ఆధ్యాత్మిక ప్రసంగం​

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 05-05-2026:​వీరఘట్టం మండలం దశుమంతపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన రామ మందిర ప్రతిష్టా మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్వీ రమణ రామాయణ విశిష్టతను మరియు రామ మహిమలను భక్తులకు వివరించారు. రామ నామ స్మరణతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, శ్రీరాముడి జీవితం ఆదర్శప్రాయమని ఆయన పేర్కొన్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. ఈ వేడుకను పురస్కరించుకుని భక్తులకు తీర్థప్రసాద వినియోగం ఘనంగా నిర్వహించారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments