​పాలకొండలో ఘనంగా ఈశ్వరమ్మ దినోత్సవం

పాలకొండ వెబ్ న్యూస్, తేదీ: 06-05-2026 పాలకొండ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం ఈశ్వరమ్మ దినోత్సవ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మాతృమూర్తి ఈశ్వరమ్మ స్మారకార్థం జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన నాటికలు మరియు నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారుల కళా ప్రదర్శనలతో పాటు ఆధ్యాత్మిక ప్రసంగాలు నిర్వహించి ఈశ్వరమ్మ విశిష్టతను మరియు ఆమె సేవా దృక్పథాన్ని కొనియాడారు. ఈ వేడుకను వీక్షించేందుకు పట్టణంలోని భక్తులు మరియు సత్యసాయి సేవా సమితి సభ్యులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 

​news by: BSS Prasad

Post a Comment

0 Comments