విజయ హాస్పిటల్ లో ఉచిత కంటి ఆపరేషన్లు

పాలకొండ వెబ్ న్యూస్, మే 09, 2026: పాలకొండలోని విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఉచితంగా కంటి ఆపరేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దూబ పద్మావతి తెలిపారు. పేద ప్రజలకు కంటి చూపును అందించాలనే సత్సంకల్పంతో ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

​ఈ హాస్పిటల్ లో క్యాటరాక్ట్, రెటీనా కేర్, గ్లూకోమా, డిజిటల్ ఐ స్ట్రయిన్ వంటి సమస్యలకు ఆరోగ్యశ్రీ, ఆరోగ్య రక్ష, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ మరియు పెన్షనర్ హెల్త్ స్కీమ్ ద్వారా ఉచిత చికిత్స అందించడం జరుగుతుంది. అత్యంత పరిశుభ్రమైన ఆపరేషన్ థియేటర్ తో పాటు అనుభవం కలిగిన వైద్యులు ఇక్కడ అందుబాటులో ఉంటారు. పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు ఇతర సుదూర ప్రాంతాల ప్రజలు కంటి ఆపరేషన్ల కోసం విశాఖపట్నం, విజయనగరం వంటి నగరాలకు వెళ్లి రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, తక్కువ సమయంలోనే నాణ్యమైన చికిత్స అందిస్తామని పద్మావతి స్పష్టం చేశారు. గిరిజన మరియు సామాన్య ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments