సీతంపేట అన్నా క్యాంటీన్‌లో ఎమ్మెల్యే నిమ్మక జయక్రిష్ణ ఆకస్మిక తనిఖీ

పాలకొండ వెబ్ న్యూస్..తేది: 09-05-2026:​పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయక్రిష్ణ శనివారం సీతంపేట మండల కేంద్రంలోని అన్నా క్యాంటీన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో నిర్వహిస్తున్న భోజన సదుపాయాలను మరియు వంటశాలలోని ఆహార పదార్థాల నాణ్యతను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం అక్కడ భోజనం చేస్తున్న సామాన్య ప్రజలతో ముచ్చటించి, వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆహారం రుచిగా ఉందా లేదా అని అడిగి తెలుసుకున్న ఆయన, ప్రజల సంతృప్తియే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. క్యాంటీన్ ప్రాంగణాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని మరియు పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో ఎటువంటి అలసత్వం వహించకూడదని అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments