ఎన్జీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎన్జెక్ క్రికెట్ ప్రీమియం లీగ్ పోటీలలో భామిని, సీతంపేట, బిటివాడ, బత్తిలి జట్ల ఘన విజయం

​పాలకొండ వెబ్ న్యూస్, 30 మే 2026:

​ఎన్జీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎన్జెక్ క్రికెట్ ప్రీమియం లీగ్ లో భాగంగా శనివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రికెట్ ఆటల పోటీలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ రోజు జరిగిన మొదటి మ్యాచ్ లో భామిని, తంపటాపల్లి జట్లు తలపడగా భామిని జట్టు విజేతగా నిలిచింది. రెండవ మ్యాచ్ లో సీతంపేట, వీరఘట్టాం జట్లు పోటీ పడగా సీతంపేట జట్టు విజయం సాధించింది. మూడవ మ్యాచ్ లో బిటివాడ, సామరెల్లి జట్లు తలపడగా బిటివాడ విజేతగా నిలిచింది. చివరిగా జరిగిన నాల్గవ మ్యాచ్ లో శ్రీకృష్ణ యూత్, బత్తిలి జట్లు తలపడగా బత్తిలి జట్టు ఘన విజయం సాధించింది.

ఈ పోటీలలో గెలుపొందిన జట్లకు రేపు ఉదయం 9 గంటల నుండి సెమీఫైనల్స్ పోటీలు ప్రారంభం కానున్నాయని టోర్నమెంట్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. రేపు జరగబోయే మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో సీతంపేట, భామిని జట్లు తలపడనుండగా, రెండవ సెమీఫైనల్ మ్యాచ్ లో బిటివాడ, బత్తిలి జట్లు తలపడతాయని నిర్వాహకులు వెల్లడించారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments