పాలకొండ నగర పంచాయతీలో వార్డుల పునర్విభజనను శాస్త్రీయంగా చేపట్టాలని కోరుతూ సిపిఎం ప్రతినిధి బృందం దావాలరమణారావు, ఎం. రమేష్, మాజీ వార్డ్ మెంబర్ ఎస్ .నారాయణరావు కలిసి కమిషనర్‌కు అభ్యంతరాల అర్జీని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నేత దావాల రమణారావు మాట్లాడుతూ దశాబ్దాలుగా కలిసి ఉన్న వీధులు, కాలనీలను ముక్కలు చేయడం వల్ల ప్రజల ఐక్యత దెబ్బతింటుందని, మౌలిక వసతుల కల్పనకు ఆటంకం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత విభజన వల్ల ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేరు వేరు వార్డుల్లోకి విడిపోయే ప్రమాదం ఉందన్నారు. భౌగోళికంగా ఒకే ప్రాంతంగా ఉన్న బుట్టి మట్టం కాలనీ, ఎన్ఎస్ఎన్ కాలనీ ఒకే వార్డులో ఉంచాలి. జంగాల చెరువు దగ్గర నుండి వాటర్ ట్యాంక్ వీధి అనుసరించిన మూడు వీధులు ఒకే వార్డులో ఉండాలి. ఎన్. కె రాజపురం పాత ఊరు కొత్త వీధి ప్రాంతమంతా ఒకే వార్డు పరిధిలోకి వచ్చేలా చూడాలి. ఇందిరా నగర్ కాలనీ మరియు విజయ ఆసుపత్రి దగ్గర నుండి సాయి దుర్గా నగర్ సాయి సంపత్ నగర్, నక్కల పేట ,గారమ్మ కాలనీ, కస్పావీది గాసి వీధి ,తదితర ప్రాంతాలు పాలకొండ నగర పంచాయతీలో పాలకొండ గ్రామం ఎన్ కె రాజపురం వడమ గ్రామాలు ఉన్నాయి. భౌగోళికంగా ఉన్న ప్రాంతాలన్నీ ఒకే వార్డు లో ఉండే విధంగా శాస్త్రీయ పద్ధతిని అమలు చేయాలని కోరారు.
0 Comments