నీ విరహమే నాకు నరకమై తోచినే
నీ తోడే ఉంటే నా ప్రాణమే నిలుచునే.
చెలియా చెలియా నీ శ్వాసే నాకు ప్రాణమై నిలిపినే
సఖియా సఖియా నీ చూపే నాకు కనుచూపై నిలిపినే
నీతో నేను కన్న కలలే నాకు స్వర్గమై నిలుచునే
నీవే నాకు తోడై ఉంటే జగతినే జయంతునే
మండుటెండలో నిన్న తలచిన మజానే పొందునే
మంచుకొండలొ కూరిపోయిన నిన్నే తలుతూనే
పిచ్చివాడని ఈలోకం అన్నా నీలోకమే నాకిష్టమే
చెలియా చెలియా నీ శ్వాసే నాకు ప్రాణమై నిలిపినే
సఖియా సఖియా నీ చూపే నాకు కనుచూపై నిలిపినే
జగతిలో మనిమిద్దరమే జతగా తిరిగితే
ఊహకే ఆవింత ఎంతో ఆశ్చర్యమేగొలిపినే.
ఈలోకమే నన్ను పిచ్చివాడన్న
నీ తోడుకై నేను ఎదురే చూతునే
చెలియా చెలియా నీ శ్వాసే నాకు ప్రాణమై నిలిపినే
సఖియా సఖియా నీ చూపే నాకు కనుచూపై నిలిపినే
నీ విరహమే నాకు నరకమై తోచినే
నీ తోడే ఉంటే నా ప్రాణమే నిలుచునే
చెలియా చెలియా
రచన.. అల్లెన కాశీదాస్
0 Comments