పాలకొండ పట్టణంలోని వెంకట గౌరీ థియేటర్ ఆవరణలో 43 సంవత్సరాలు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రెసిడెంట్ సూర్య, ఎన్టీఆర్ ఫాన్స్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరాం, సేవా సంఘాల అధ్యక్షుడు పవన్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పేరు మీద కోట దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులకు పళ్ళు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి గుండెల్లో నందమూరి తారక రామారావు చిరస్మరణీయమైన పేరు సంపాదించుకున్నారు. మార్చి 29, 1982న ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన వారసత్వాన్ని, రూపాన్ని పుణికి పుచ్చుకుని, తాత ఎన్టీఆర్, బాబాయ్ బాలకృష్ణలను ఆదర్శంగా తీసుకుని జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్‌గా ఎదిగారు. మే నెలలో తాత, మనవడు ఇద్దరూ జన్మించడం అభిమానులకు ఎంతో ప్రత్యేకమైనది. నటనలో నవరసాలను సులభంగా పలికించగల సామర్థ్యం ఉన్న జూనియర్ ఎన్టీఆర్, 13 ఏళ్ల వయసులోనే నట విశ్వరూపం చూపించి తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, మాధవు, సింహాద్రి, శంకర్రావు, అజిత్ బాబు, అప్పలనాయుడు మరియు నందమూరి అభిమానులందరూ పాల్గొన్నారు.
news by: BSS Prasad
0 Comments