పాలకొండ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న NJK క్రికెట్ ప్రీమియం లీగ్ రెండో రౌండ్ ఐదో రోజు పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. ఈ టోర్నీలో భాగంగా జరిగిన పలు మ్యాచ్ లలో వరుణ్ మోటార్స్ పై కృష్ణ యూత్, అట్టలి పై నాగ వంశపు వీధి, భరణ సేతంపేట పై ఫైర్స్ స్ట్రోమ్స్, పెద్దూరు పై వీర ఘట్టాం, జనసేన వీర ఘట్టాం పై తూడి, అచ్చేప్పవలస పై బిటివాడ, వీర ఘట్టాం పై ఎస్ కె ఎస్ నీలానగరం జట్లు విజయం సాధించాయి. అలాగే అడ్డుబంగి పై మండ, ఉప్పర జమ్మి పై కోడిస, అంటికొండపై పెద్దూరు, కడగండి పై దారపాడు జట్లు ఘన విజయాలు అందుకున్నాయని టోర్నమెంట్ నిర్వాహకులు వెల్లడించారు.
ఈ క్రీడా పోటీల ముగింపు అనంతరం విజేతలకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మెడల్స్ ను పాలకొండ ఎస్సై డోల వెంకన్న చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా తమ కాలాన్ని క్రీడల వైపు వెచ్చించాలని పిలుపునిచ్చారు. యువత అంతా డ్రగ్స్, మత్తు పదార్థాలకు, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ఎటువంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడరాదని, మీ యొక్క కెరీర్ ను పాడు చేసుకోవద్దని వారించారు. క్రీడల్లో రాణించి మీకు, మీ కుటుంబానికి మరియు ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
news by: BSS Prasad
0 Comments