బెజ్జి సైనింగ్ స్టార్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆనందకు అప్పలనాయుడు, ప్రసాద్ అభినందనలు

పాలకొండ వెబ్ న్యూస్, 18 మే 2026:

స్థానిక బెజ్జి సైనింగ్ స్టార్స్ క్రికెట్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించిన వావిలిపల్లి ఆనందను సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కర్నేన అప్పలనాయుడు, మిడితన ప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులలో ఎంతో ప్రతిభ దాగి ఉందని, ఇలాంటి పోటీలు వారి నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఆనంద రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొని విజేతకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. యువత క్రీడల్లో రాణించడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చని నాయకులు ఈ సందర్భంగా సూచించారు.

Post a Comment

0 Comments