విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించే విధానాలను ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వమే విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి సంస్థ సిబ్బందితోనే నడపాలని డిమాండ్ చేస్తూ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలకొండ డిపోలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ మెంబర్ ఎం వైకుంఠం మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు డిమాండ్స్ బ్యాడ్జ్స్ ధరించి ఈ నిరసన చేపట్టినట్లు స్పష్టం చేశారు. స్త్రీ శక్తి స్కీమ్ లో మహిళలకు జీరో టిక్కెట్ ఇచ్చే విధానాన్ని ఉపసంహరించి ఉద్యోగులపై పని ఒత్తిడిని నివారించాలని ఆయన కోరారు. ఉద్యోగులకు రావలసిన డీఏ, ఈఎల్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, కొత్త పీఆర్‌సీ కమీషన్ ను నియమించి త్వరితగతిన అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ పిటిడి ఉద్యోగులను ఈహెచ్ఎస్ నుండి మినహాయించి గతంలో ఆర్టీసీలో ఉన్న వైద్య సదుపాయాన్ని పునరుద్ధరించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణమే 3000 కొత్త బస్సులు కొనుగోలు చేసి, కొత్త రిక్రూట్మెంట్ చేపట్టాలని, మెమోరాండం లో పేర్కొన్న అన్ని అంశాలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి వావిలపల్లి రాజేష్, డిప్యూటీ కార్యదర్శి డిజీరావు, సీనియర్ నాయకులు డీజే బాబు, ఎంఆర్ మూర్తి, ఏ కృష్ణ, కేతవుడు, పుణ్యవతి, జి మంగ, భారతి మరియు గ్యారేజ్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
news by: BSS Prasad
0 Comments