పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్‌గా డాక్టర్ శివ్వాల మన్మథరావుకు పదోన్నతి

పాలకొండ వెబ్ న్యూస్, మే 21: పార్వతీపురం మన్యం జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ శివ్వాల మన్మథరావుకు పశుసంవర్ధక శాఖలో ఉన్నత పదోన్నతి లభించింది. ఇప్పటివరకు డిప్యూటీ డైరెక్టర్ కేడర్‌లో విధులు నిర్వర్తించిన ఆయన, తాజాగా సంయుక్త సంచాలకులుగా (జాయింట్ డైరెక్టర్) ప్రమోషన్ పొందారు. పదోన్నతి పొందిన అనంతరం ఆయన విజయనగరం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్‌గా కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా మన్మథరావుకు పదోన్నతి లభించడం పట్ల జిల్లాలోని పలువురు ప్రభుత్వ అధికారులు,  కార్యాలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments