శ్రీ కోటదుర్గమ్మ వారి సన్నిధిలో నిత్య అన్నదానానికి శ్రీకారం

పాలకొండ వెబ్ న్యూస్, 21 మే 2026:
కలింగాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ వాసుల ఇలవేల్పు కోటదుర్గమ్మ తల్లి వారి నిత్య అన్నదాన పథకానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. పాలకొండ పట్టణానికి చెందిన సీనియర్ టిడిపి నాయకుడు ఆధ్యాత్మికవేత్త పల్లా కొండబాబు విజయనిర్మల దంపతులతో అధికారులు చర్చలు జరిపారు. కోటదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో నిత్య అన్నప్రసాద కార్యక్రమానికి కావలసిన నిధి ఏర్పాటుకు 20 లక్షల అవసరమని నిర్ణయం చేశారు. ఈ నిధులు భక్తుల నుంచి సేకరించి అన్నదాన ట్రస్ట్ కు ఏర్పాటు చేయనున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరగనున్నదని ఆలయ కార్య నిర్వహణ అధికారి వివి సూర్యనారాయణ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ వెల్లడించారు. ముందుగా స్వర్గీయ పల్లా బాబ్జీరావు సూరమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు పల్లా కొండబాబు విజయనిర్మల దంపతులు లక్ష ఒక్క రూపాయి విరాళంగా ప్రకటించారు.
​అన్నప్రసాద ఏర్పాట్లను చరవాణి ద్వారా తెలుసుకున్న ఆలయ పూర్వపు సేవకులు శరన్నవరాత్రి ఉత్సవాల అధ్యక్షులు భాసూరు రామారావు సరస్వతమ్మ దంపతుల పేరు మీద వారి కుమారులు మరో లక్ష ఒక్క రూపాయి అందించేందుకు నిర్ణయించినట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ సెక్రటరీ భాసూరు కృష్ణమూర్తి ప్రకటించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి సూర్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ కోటదుర్గమ్మ తల్లి వారి సన్నిధిలో నిత్య అన్నదాన పథకానికి భక్తులు విరివిగా విరాళాలు ఇవ్వాలని వచ్చిన విరాళాలను అమ్మవారి పేరుమీద బ్యాంకులో డిపాజిట్ చేసి దాని ద్వారా వచ్చిన వడ్డీతో ఈ పథకానికి ప్రణాళికలు వేయడం జరిగిందని వెల్లడించారు. ప్రతి భక్తుడు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments