క్రికెట్ టోర్నమెంట్‌లో హోరాహోరీ పోరు: విజేతలుగా తంపటాపల్లి, ఆర్ డి బాయ్స్, గారమ్మ కాలనీ

పాలకొండ వెబ్ న్యూస్, 23 మే 2026: ​స్వర్గీయ నిమ్మక గోపాలరావు జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న NJK క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఏడవ రోజు పోటీలు పాలకొండ డిగ్రీ కళాశాల వేదికగా ఉత్సాహభరితంగా సాగాయి. ఈరోజు జరిగిన మొదటి మ్యాచ్‌లో తంపటాపల్లి మరియు యంగ్ స్టార్స్ తలపడగా తంపటాపల్లి విజయం సాధించింది. రెండవ మ్యాచ్‌లో ఆర్ డి బాయ్స్ మరియు అర్ధలి తలపడగా ఆర్ డి బాయ్స్ ఘనవిజయం అందుకుంది. మూడవ మ్యాచ్‌లో గారమ్మ కాలనీ మరియు తుమరాడ మధ్య జరిగిన పోటీలో గారమ్మ కాలనీ విజేతగా నిలిచింది. స్థానిక పాలకొండ ఎంపీపీ భాను సుధాకర్ ఈ ఆటల పోటీలను దగ్గరుండి పర్యవేక్షించారు.

​అనంతరం విజయం సాధించిన జట్లకు ఎంపీపీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గౌరవ ఎమ్మెల్యే నిర్వహిస్తున్న ఈ మంచి సదావకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మొత్తం కార్యక్రమం నిర్వాహకులు నెల్లి వెంకటరమణ, కొండ దాడి రాజేష్, మజ్జి రామకృష్ణ పర్యవేక్షణలో అత్యంత క్రమశిక్షణతో జరుగగా, మ్యాచ్‌లకు అంపైర్స్ మరియు స్కోరర్స్ గా ఎల్ వెంకటరమణ, తిరుమల, పోరెడ్డి ప్రశాంత్, పొట్నూరు రమేష్, మదన్ వ్యవహరించి బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments