కోట దుర్గమ్మ ఆలయ పరిసరాల్లో సాయి సేవకులు, పాలకొండ మహిళల స్వచ్ఛంద సేవ

పాలకొండ వెబ్ న్యూస్, 23 మే, 2026:

​పాలకొండలోని కోట దుర్గమ్మ అమ్మవారి ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు డి గదబ వలస గ్రామ సాయి సేవకులు, పాలకొండ మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం, ఆలయ పవిత్రతను కాపాడేందుకు గాను వీరంతా కలిసి ఆలయ ప్రాంగణాన్ని మరియు చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రం చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మిక ప్రదేశాలను స్వచ్ఛంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని చాటిచెప్పారు. ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో డి గదబ వలస గ్రామ సాయి సేవకులతో పాటు పాలకొండ మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని పరిసరాలను చక్కగా తీర్చిదిద్దారని శ్రీ కోట దుర్గమ్మ దేవాలయ ఈవో సూర్యనారాయణ తెలిపారు. సమాజ సేవా దృక్పథంతో చేసిన ఈ కార్యక్రమం స్థానికంగా పలువురి ప్రశంసలు అందుకుంది.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments