సంక్షేమ పథకాలతో పెచ్చరిల్లుతున్న అప్పుల సంస్కృతి: ఖండాపు ప్రసాదరావు

​పాలకొండ వెబ్ న్యూస్, 24 మే 2026:

​సంక్షేమ పథకాల పేరిట ప్రభుత్వాలు అవలంబిస్తున్న మితిమీరిన వినిమయతత్వం వల్ల ప్రజలు, దేశం అప్పులపాలు కావడానికి పాలకులే కారణమని అభ్యుదయ రైతు, సీనియర్ సిటిజన్ ఖండాపు ప్రసాదరావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు నిజంగా పెరిగి ఉంటే ఉచిత సంక్షేమ పథకాల అవసరం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. ఎగుమతులు పెంచకుండా విచ్చలవిడిగా దిగుమతులను ప్రోత్సహించడం వల్లే రూపాయి విలువ పతనమవుతోందని విమర్శించారు. గతంలో కరువులు వచ్చినా పని కల్పించి ఆదుకునేవారని, కానీ ప్రస్తుత అర్థరహిత పథకాలు పని సంస్కృతిని దెబ్బతీస్తూ ప్రజలను సోమరిపోతులుగా మారుస్తున్నాయని మండిపడ్డారు. ఆదాయంతో పొంతన లేకుండా అప్పులు చేయడం వల్ల కుటుంబాలతో పాటు ప్రభుత్వాలు కూడా దివాళా తీసే ప్రమాదం ఉందని, పాలకులు దుబారా పథకాలకు స్వస్తి పలికినప్పుడే ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని ఖండాపు ప్రసాదరావు స్పష్టం చేశారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments