రేపు ఏపీ ఈఏపీసెట్ ప్రాథమిక కీ విడుదల

పాలకొండ వెబ్ న్యూస్, 24 మే, 2026:

​ఆంధ్రప్రదేశ్ జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్-2026 పరీక్షల ప్రాథమిక కీని రేపు, అనగా 25వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఏపీ ఈఏపీ సెట్ చైర్మన్ సీఎస్ఆర్కే ప్రసాద్, కన్వీనర్ ఎన్.మోహనరావు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పరీక్ష రాసిన విద్యార్థులు తమ ప్రాథమిక కీని అధికారిక వెబ్‌సైట్ ద్వారా పరిశీలించుకోవచ్చునని వారు పేర్కొన్నారు. ఈ కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, వాటిని ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటల వరకు వెబ్‌సైట్ ద్వారానే ఆన్‌లైన్‌లో తెలియజేయడానికి అవకాశం కల్పించినట్లు అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ గడువును గమనించి తమ అభ్యంతరాలను సమర్పించాల్సి ఉంటుంది.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments