అమ్మ పాలకొండ కోటదుర్గమ్మతల్లి.. రచన... అల్లెన కాశీదాస్

అమ్మ  పాలకొండ కోటదుర్గమ్మతల్లి
అమ్మ  పాలకొండ కోటదుర్గమ్మతల్లి-నీపాదాల చెంతకు వచ్చినాముసల్లంగా చూడు తల్లి 
పిల్లాపాపలతోటి బైలెళ్లినాము-మొక్కిన మొక్కులన్నీ తీర్చుకుంటాము
మా పిల్లపాపల నల్ల సల్లంగా చూడు తల్లి-అమ్మ పాలకొండ దుర్గమ్మ తల్లి

దసరాకు వచ్చినాము వెలుగులన్నీ చూసినాము-తిరువీధుల్లో నిన్ను చూసి ఎంతో ఆనందించాము
మమ్మల్ని చల్లగా కాచే మాకొండంత దైవమా- సల్లగా చూడు అమ్మ మాకు దారి చూపు తల్లి
అమ్మ పాలకొండ కోట దుర్గమ్మతల్లి జై జై దుర్గమ్మ తల్లి జై జై
పాలకొండ అమ్మ భక్తులపాలిటీ బంగారు తల్లి 
బాధలన్నీ పోగొట్టే మా తల్లి మొక్కులన్నీ తీర్చే మా తల్లి

ఏటేటా వస్తాము నిన్ను తనివితీరా సూస్తాము-మా ఆలు బిడ్డల నల్ల సల్లంగా చూడు తల్లి
నువ్వు రాజులోరి దైవమంట పేదోళ్లకు పెన్నిదంట
మేము కోరిన కోరికలు తీర్చి దీవించు తల్లి -మా ఇంటి దీపమయ్యే తల్లి 

నిజరూపంలో నిన్ను చూసి ఎంతో తరించినాము-జీవితమే ధన్యమని ఎంతో మురిసినాము 
కోరిన కోర్కెలు తీర్చే కొండంత దైవమా-నీ కరుణే మాకు ఆశీర్వాదం
దసరాకు వచ్చినాము వెలుగులన్నీ చూసినాము-తిరువీధుల్లో నిన్ను చూసి ఎంతో మురిసినాము
మమ్మల్ని చల్లగా కాచే మా కొండంత దైవమా 
అమ్మ పాలకొండ కోట దుర్గమ్మతల్లి జై జై      దుర్గమ్మ తల్లిజై జై   
         
పాలకొండ అమ్మభక్తుల పాలిట బంగారు తల్లి-బాధలన్నీ పోగొట్టే మా తల్లి మొక్కులన్నీ తీరిచే మా తల్లి 
కన్నీళ్ళ కడలిలో నువ్వే పడవవై వస్తావు -నమ్మకపునడకలో నువ్వే తోడై ఉంటావు 
మా వేడుకలు ఇంటిలో నువ్వే పండగ అవుతావు -కరుణారూపమా మమ్ము కాపాడు తల్లి 
దుర్గమ్మ తల్లి పాలకొండ అమ్మ భక్తుల పాలిట బంగారు తల్లి 
బాధలన్నీ పోగొట్టే మాతల్లి మొక్కులన్నీ తీర్చే మా
తల్లి అమ్మ పాలకొండ కోట దుర్గమ్మతల్లి

పాట రచన : అల్లెన కాశిదాస్, పాలకొండ .....
సర్వ హక్కులు రచయితవి..

Post a Comment

2 Comments

  1. అద్భుతంగా రాశారు సార్.
    మన అమ్మ దుర్గమ్మ తల్లి మీద ఉన్న భక్తి ప్రతి లైన్లో కనిపిస్తోంది 🙏
    చదువుతుంటే నిజంగా భక్తి భావం కలుగుతోంది sir 👍🙏🙏 జై కోటదురమ్మ,🙏

    ReplyDelete