మన పుట్టినరోజులు, వివాహ వేడుకలు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల పరమార్థం ఇతరులకు సహాయపడటంలోనే ఉందని దిలీప్ కుమార్ కుమిలి అన్నారు. ఇందులో భాగంగానే పట్నాయకుని శివప్రసాద్ కుమార్తె చిరంజీవి శ్రీజ (అమెరికా) పుట్టినరోజును పురస్కరించుకుని పాలకొండ పట్టణ పరిసర ప్రాంతాల్లోని నిరుపేదలకు చీరలను పంపిణీ చేశారు. ప్రతి సందర్భాన్ని ఇలా సేవా కార్యక్రమంగా మలచుకుంటున్న శివప్రసాద్ ను ఆయన అభినందించారు. సమాజం మనకు ఎంతో ఇచ్చిందని, కాబట్టి అంబేద్కర్ నినాదమైన 'పే బ్యాక్ టు సొసైటీ'ని మనం విధానంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అన్న మదర్ తెరిస్సా మాటలు మనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.
news by: BSS Prasad
0 Comments