మహానాడును విజయవంతం చేయాలి: పడాల భూదేవి పిలుపు

పాలకొండ వెబ్ న్యూస్, తేదీ 25/5/2026: పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఇరవై వార్డుల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం సోమవారం  పల్లా కొండబాబు కళ్యాణ మండపంలో జరిగింది. నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి పడాల భూదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి టౌన్ అధ్యక్షుడు గుమ్మడి సింహాద్రి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి పడాల భూదేవి మాట్లాడుతూ ఈనెల ఇరవై ఏడు, ఇరవై ఎనిమిది తేదీల్లో జరిగే మినీ మహానాడుకు ఇరవై వార్డుల పరిధిలోని టిడిపి నాయకులు, అన్ని విభాగాల కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. మహానాడు ఏర్పాట్లపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ, పార్టీ బలోపేతానికి అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కోట దుర్గ అమ్మవారు చైర్మన్ శాసపు సర్వారావు, మాజీ నగర పంచాయతీ చైర్మన్ ప్రతినిధి ఆకుల కుమార్, టిడిపి కార్యకర్తలు గుమ్మడి ఉమామహేశ్వరరావు, దుమ్ముదు దుర్గారావు, దుప్పాడ నారాయణరావు, గుమ్మడి శంకర్రావు, గుమ్మడి కృష్ణ, పొన్నాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments